జీవిత లక్ష్యం
🌹 జీవితంలో ఏ లక్ష్యం పెట్టుకుంటే జీవితం ఆ వైపు వెళుతుంది
జీవితంలో ఏ లక్ష్యం పెట్టుకోకుండా , లక్ష్యాన్ని అలక్ష్యం చేస్తే, జీవితం చుక్కాని లేని పడవ లాగా, ఏ దిశ లేకుండా, అగమ్య గోచరంగా, అటు , ఇటు ,ఊగుతూ, అస్తవ్యస్తంగా తయారవుతుంది.
జీవితానికి లక్ష్యం కావాలి. ఆ లక్ష్యం జీవితాన్ని నడిపిస్తుంది.
పడవ ప్రయాణం ఎటువైపు దాని గమ్యం వైపు మీ జీవిత ప్రయాణంఎటువైపు మీ లక్ష్యం వైపు
నీ లక్ష్యాన్ని బట్టి నీ జాతకం ఉంటుంది. లక్ష్యం లో స్పష్టత కావాలి.
🌹ఏదో బతుకుతాంలే అనుకుంటే జీవితం కూడా దానికి తగినట్టుగా ఉంటుంది. ఏ లక్ష్యం అయినా పెట్టుకో.
🌹నేను ధనవంతుడు కావాలి అనుకుంటే అలాగే అవుతావు
మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే అలాగే కట్టుకుంటావు.
🌹నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాని కావాలి అనుకుంటే అలానే అవుతాం.
🌹నేను ఒక వివేకానందుని వర్ధమాన మహావీరుడును బుద్ధుని కావాలి అనుకుంటే అలానే అవుతాం
నీ లక్ష్యం ఎంపిక పూర్తి బాధ్యత నీదే
🌹*నువ్వు పెట్టుకోన్న లక్ష్యమే జీవితాన్ని ఆ వైపు కు నడిపిస్తుంది.
నీ లక్ష్యం ఏంటో నీ జీవితం అదే .*
🌹 నీ లక్ష్యం సాధించడానికి కావలసిన శక్తి కి మనం ప్రతిరోజూ ధ్యానం చేయాలి
No comments:
Post a Comment